ప్లాస్టిక్ సంచుల నివారణపై అవగాహన

50చూసినవారు
ప్లాస్టిక్ సంచుల నివారణపై అవగాహన
ఓదెల మండలం కొమిరెలో బుధవారం అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవం సందర్భంగా సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ సంచుల నివారణపై అవగాహన కల్పించారు. పెద్దపల్లి శాసనసభ్యులు విజయరమణరావు హాజరై బట్ట సంచులను ఉచితంగా పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో మాజీ సర్పంచ్ లు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి, ఆకుల మహేందర్, మాజీ ఉప సర్పంచ్ గోలి లింగారెడ్డి, డాక్టర్ వెంకటేశ్వర్లు, క్యాతo మల్లేశం, నవీన్, వినోద్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్