'ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో కోత సరికాదు'

1973చూసినవారు
'ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో కోత సరికాదు'
కరోనా వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా ప్రభుత్వ ఉద్యోగుల జితాల్లో కోత విధించడం సరికాదని, జీవో 27ను వెంటనే విరమించుకోవాలని సీపీఐ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం డిమాండ్ చేశారు. అవసరమైతే ప్రభుత్వంలో కొనసాగుతున్న ప్రజా ప్రతినిధుల జీతాలను నిలిపివేయాలని ఆయన అన్నారు. చాలి చాలని జీతాలతో కాలం వెళ్ళబుచ్చుతున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్, స్కీం వర్కర్ల వేతనాలలో ప్రభుత్వ జీఓ ప్రకారం 10శాతం జీతాలు తగ్గించడం అమానుషమని ఆయన తెలిపారు.

అత్యవసర పరిస్థితులలో మెడికల్, పారిశుధ్యం, నీటి సరఫరా లాంటి ఇతర రంగాలలో పనిచేస్తున్న కార్మికులకు ఇంటి ఇంటికి తిరిగి ప్రజల ఆరోగ్యం సమాచారం సేకరిస్తున్న ఆశ వర్కర్లు, అంగన్ వాడీ టీచర్లు సేవలని అభినందించి పారితోషికం పెంచాల్సింది పోయి వారి జితాల్లో 10 శాతం కోత విదించడం అప్రజాస్వామికమని అన్నారు.

ట్యాగ్స్ :