వైఎస్ఆర్ కు నివాళులర్పించిన ఎమ్మెల్యే

61చూసినవారు
వైఎస్ఆర్ కు నివాళులర్పించిన ఎమ్మెల్యే
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సోమవారం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు బూషణవేన సురేష్ గౌడ్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ జయంతిని నిర్వహించారు. గాంధీ విగ్రహం వద్ద పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు వైఎస్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నూగిళ్ల మల్లయ్య, అమ్రేష్, పాగాల శ్రీకాంత్, నెత్తెట్ల కుమార్ యాదవ్, శ్రీమాన్, బొంకూరి అవినాష్, పైడ రవి, ఈర్ల స్వరూప, సయ్యద్ మస్రత్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్