Sep 18, 2024, 15:09 IST/రామగుండం
రామగుండం
గడువులోగా రైస్ డెలివరీ పూర్తి చేయాలి: కలెక్టర్
Sep 18, 2024, 15:09 IST
నిర్దేశించిన గడువులోగా ఖరీఫ్ 2023- 24, రబీ సీజన్లకు సంబంధించి పెండింగ్ రైస్ డెలివరీని తప్పక పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మిల్లర్లను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్ తో కలిసి జిల్లాలోని రైస్ మిల్లర్లు, అధికారులతో పెండింగ్ లో ఉన్న రైస్ డెలివరీపై సమీక్షించారు. సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి రాజేందర్, జిల్లా పౌరసరఫరాల మేనేజర్ శ్రీకాంత్ పాల్గొన్నారు.