సుల్తానాబాద్: ప్రమాదవశాత్తు యువకుడు మృతి
సుల్తానాబాద్ పూసాలకు చెందిన కంకణాల శ్రవణ్ కుమార్(౩౦) అనే యువకుడు ప్రమాదవశాత్తు మృతి చెందినట్లు ఎస్సై నరేష్ కుమార్ తెలిపారు. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గతకొంత కాలంగా మద్యంకు బానిసైన యువకుడు తాగిన మైకంలో రైస్ మిల్ అసోసియేషన్ పక్కన గల కిరాణ షాప్ రేకులపైకెక్కి ప్రమాదవశాత్తు కింద పడడంతో కాంపౌండ్ గోడ మధ్య ఇరుక్కుని గాయాలతో మృతి చెందాడని తెలిపారు. తల్లి విజయ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.