ఆటో డ్రైవర్ సూసైడ్
వెనుగుమట్ల గ్రామానికి చెందిన పొన్నం వెంకటేష్ ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై సతీష్ శనివారం తెలిపిన వివరాల ప్రకారం వెంకటేష్ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు కాగా రెండు నెలల క్రితం కూతురు జన్మించింది. చిన్నారి ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవడంతో వైద్యానికి రూ.4 లక్షల ఖర్చు చేశాడు. అయినప్పటికీ పాప ఆరోగ్యం బాగాలేక చేసిన అప్పులు ఎలా తీర్చాలో అనే బెంగతో శుక్రవారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.