జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదులను మట్టుపెట్టేందుకు భద్రతా బలగాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కశ్మీర్ లోయలో ఉగ్రవాద కార్యకలాపాలను కట్టడి చేసేందుకు అక్కడి పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా నలుగురు అనుమానిత ఉగ్రవాదులకు చెందిన ఊహాచిత్రాలను కథువా పోలీసులు శనివారం ఉదయం రిలీజ్ చేశారు. ఫొటోల్లో ఉన్న ఉగ్రవాదుల గురించి సమాచారం అందించిన వారికి రూ.5 లక్షల నగదు బహుమతి ఇస్తామని ప్రకటించారు.