మిరపకాయలను ఫ్రిజ్‌లో పెట్టేటప్పుడు దాని తొడుమను తీసేసి పెడితే ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. మిర్చిని గాలి చొరబడని డబ్బాలో ప్యాక్ చేసి పెట్టాలి. మిర్చి త్వరగా పాడైపోవడానికి నీరు కూడా కారణం. మిరపకాయలను కడిగినప్పుడల్లా వాటిని బాగా ఆరబెట్టి ఆపై రిఫ్రిజిరేటర్‌లో ఉంచండి. తొడుమ తీసేసిన మిరపకాయలకు తొడుమ ప్రదేశంలో కాస్త నూనె రాస్తే ఎక్కువ కాలం ఆగుతాయి. మిర్చిని కొత్తిమీరతో కలిపి ఎప్పుడూ ఉంచవద్దు. కొత్తిమీర త్వరగా మిర్చిని పాడు చేస్తుంది.