వైఫై రూటర్‌ను 24 గంటలు ఆన్‌లో ఉంచినట్లయితే కొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. మీరు నిద్రించే గది పక్కనే రూటర్ ఉంటే మెదడుపై ప్రతికూల ప్రభావం పడుతుందని చెబుతున్నారు. ఇది నిద్రలేమికి కారణమవుతుందని కూడా వైద్యులు అంటున్నారు. అందుకే మీరు నిద్రపోయే ముందు మీ వైఫై రూటర్‌ని ఆఫ్ చేయాలి. రాత్రంతా వైఫై రూటర్‌ని వదిలేస్తే అది వెలువరించే ఎలక్ట్రోమాగ్నటిక్ రేడియేషన్ వల్ల కంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.