కేజ్రీవాల్‌ విమర్శలు.. ‘సోల్డ్‌ఔట్‌’ అంటూ బీజేపీ కౌంటర్‌

53చూసినవారు
కేజ్రీవాల్‌ విమర్శలు.. ‘సోల్డ్‌ఔట్‌’ అంటూ బీజేపీ కౌంటర్‌
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇరు పార్టీల విమర్శలతో ఢిల్లీ రాజకీయం వేడెక్కింది. తాజాగా ఢిల్లీ మాజీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ కమలం పార్టీపై ఘాటు విమర్శలు చేశారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు బంగారు గొలుసులు పంచుతున్నారని ఆరోపించారు. దీనికి బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ దీటుగా బదులిచ్చారు. ‘కేజ్రీవాల్‌ మాటలు వింటుంటే ఆయన మానసిక స్థితి సరిగా లేదని అనిపిస్తోంది. ఏ పనీ లేనప్పుడే ఇలాంటివి జరుగుతాయి. ఆయన ఓ విషయం మర్చిపోయినట్లున్నారు. ఆయన ఎప్పుడో మద్యం ట్రేడర్లకు సోల్డ్‌ఔట్‌ అయ్యారు’ అని దుయ్యబట్టారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్