ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్‌ భార్య సునీత?

76చూసినవారు
ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్‌ భార్య సునీత?
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత తన భర్త పదవిని చేపట్టేందుకు సిద్ధమవుతున్నారని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీలో ఎవరి అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా సీఎం పదవిని చేపట్టేందుకు సునీత రంగం సిద్ధం చేసుకుంటున్నారని కేంద్రమంత్రి అన్నారు. దాణా కుంభకోణంలో లాలూ జైలుకు వెళ్లినప్పుడు.. రబ్రీదేవిని కూడా అలానే బీహార్ సీఎంగా చేశారన్న విషయాన్ని గుర్తు చేశారు.

సంబంధిత పోస్ట్