కేజ్రీవాల్‌ను సీఎంగా తొలగించాలంటూ మరో పిల్

556చూసినవారు
కేజ్రీవాల్‌ను సీఎంగా తొలగించాలంటూ మరో పిల్
మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన అరవింద్ కేజ్రీవాల్ సీఎంగా కొనసాగడాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. తనను సీఎం పదవి నుంచి తప్పించాలని హిందూ సేన జాతీయ అధ్యక్షుడు విష్ణు గుప్తా పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై త్వరలో విచారణ జరుపుతామన్నారు. అయితే ఈ తరహా పిటిషన్‌పై నిన్న విచారణ జరిపిన హైకోర్టు.. కేజ్రీవాల్‌ను సీఎం పదవి నుంచి తప్పించలేమని తేల్చి చెప్పింది. ప్రస్తుతం కేజ్రీవాల్ ఈడీ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే.

సంబంధిత పోస్ట్