నవంబర్ 1 నుంచి యూపీఐ లైట్ ప్లాట్‌ఫారమ్‌లో మార్పులు జరగనున్నాయి. యూపీఐ లైట్ అకౌంట్లో లిమిట్ కన్నా తక్కువ బ్యాలెన్స్ ఉన్నప్పుడు, ఆటోమేటిక్‌గా బ్యాంక్ అకౌంట్ నుంచి ఫండ్స్ లోడ్ అవుతాయి. లిమిట్‌ను యూజర్లే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ప్రస్తుతం ఈక్విటీ పబ్లిక్ ఇష్యూలకు సంబంధించి యూపీఐ బ్లాక్ చేసే ఆప్షన్ కూడా అందుబాటులోకి రానుంది.