హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మీ అధ్యక్షతన ఆదివారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జరిగిన ‘అలయ్ బలయ్’ కార్యక్రమానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'రాజకీయ పార్టీల నేతల మధ్య విమర్శలు సహజమే. కానీ, ఇప్పుడు వాడుతున్న భాష మంచిది కాదు. విమర్శలు, ప్రతి విమర్శలు అందరూ మెచ్చేవిగా ఉండాలి. వ్యక్తిగత దూషణలు, విమర్శలు మంచిది కాదు' అని అన్నారు.