తేనెటీగల దాడిలో వృద్ధురాలు మృతి

75చూసినవారు
తేనెటీగల దాడిలో వృద్ధురాలు మృతి
దుమ్ముగూడెం మండల పరిధిలోని కోయ నర్సాపురంలో తేనెటీగల దాడితో శుక్రవారం వర్సా రాజమ్మ(63) గిరిజన వృద్ధురాలు మృతి చెందింది. గ్రామ సమీపంలోని పొలంలో పత్తి తీస్తున్న సమీపంలోని పెద్ద చెట్టుపై ఉన్న తేనెటీగలు ఒక్కసారిగా ఆమెపై దాడిచేసి శరీరం మొత్తం కరిచాయి. దీంతో తీవ్రంగా గాయపడిన అమెను వైద్యశాలకు తరలిస్తుండగా మృతి చెందింది. వృద్ధురాలి మృతితో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్