ట్రాక్టర్ బోల్తా.. పలువురికి తీవ్ర గాయాలు

77చూసినవారు
ట్రాక్టర్ బోల్తా.. పలువురికి తీవ్ర గాయాలు
చర్ల మండలంలోని పూసుగుప్ప గ్రామ పంచాయితీ వద్ధిపేట సమీపంలో మంగళవారం జరిగిన ట్రాక్టర్ ప్రమాదంలో బీజాపూర్ జిల్లా మడకగూడెం గ్రామానికి చెందిన ఆదివాసీలు తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం పూసుగుప్పలో జరిగిన పెళ్లికి హాజరై మంగళవారం స్వగ్రామం తిరిగి ట్రాక్టరుపై వెళ్తుండగా వద్ధిపేట వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. గాయపడిన వారిని చర్ల ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్