బోనకల్: భాగం సేవా ఫౌండేషన్ ఎల్ఈడీ లైట్ల వితరణ
భాగం సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, ఎన్ ఆర్ ఐ భాగం రాకేష్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలను నిర్విరామంగా కొనసాగిస్తున్నారు. బోనకల్ మండల పరిధిలోని ఆళ్లపాడు గ్రామంలో కెవిఎం బజార్ ప్రజల విజ్ఞాపన మేరకు ఐదు ఎల్ఈడి లైట్లను భాగం రాకేష్ వితరణగా అందజేశారు. తమ కోరిక మేరకు ఎల్ఈడి లైట్లను అందజేసిన భాగం సేవా ఫౌండేషన్ వారికి గ్రామస్తులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.