ఇటీవల వరదలతో పదో తరగతి సర్టిఫికెట్లు కోల్పోయిన వారి వివరాల సేకరణకు మంగళవారం నుంచి మూడు రోజుల పాటు ఖమ్మం పాత డీఈఓ కార్యాలయం వద్ద ప్రత్యేక శిబిరం నిర్వహిస్తున్నట్లు డీఈఓ సోమశేఖరశర్మ తెలిపారు. సర్టిఫికెట్లు కోల్పోయిన వారు పదో తరగతికి సంబంధించిన ధ్రువపత్రాలు ఉంటే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆపై రాష్ట్ర కార్యాలయానికి పంపించి సర్టిఫికెట్లు జారీ చేయిస్తామని డీఈఓ శర్మ ఓ ప్రకటనలో తెలిపారు.