బూర్గంపాడు మండలం సారపాకలో ఒక సమావేశంలో తెలంగాణలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తెదేపా పోటీ చేస్తుందని మహబూబాబాద్ పార్లమెంటు పరిధి పార్టీ మాజీ అధ్యక్షుడు కొండపల్లి రామచంద్రరావు తెలిపారు. సారపాకలో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ శ్రేణులు ఎన్నికలకు సమాయాత్తం కావాలని సూచించారు. పోటు రంగారావు, వాసిరెడ్డి చలపతిరావు, వట్టం నారాయణదొర, రాజా, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.