పాలేరు: 4వ రోజు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా దర్శనం
దసరా నవరాత్రుల సందర్భంగా కూసుమంచి మండలం నాయకన్ గూడెం గ్రామంలో ఇంద్రకీలాద్రి అమ్మవారిని ఆదివారం 4వ రోజు లలితా త్రిపుర సుందరి అవతారంలో దేవిగా దర్శనమిచ్చారు. ఉదయం 11 గంటలకు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి సుమేష్ యాదవ్ పాల్గొని.. పూజ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రమంతా సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుతున్నట్లు తెలిపారు.