కూసుమంచి క్యాంపు కార్యాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డితో ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా శాంతిభద్రతలకు సంబంధించిన పలు అంశాలపై వారిరువురు చర్చించారు. తప్పుడు ధృవీకరణ పత్రాలను సృష్టిస్తూ ఆక్రమణలకు పాల్పడుతున్నా వారిపై దృష్టి సారించాలని సీపీకి సూచించారు. కొంతమంది ప్రభుత్వ భూములను కూడా ఆక్రమించారని వారిని కూడా గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు.