బనిగండ్లపాడులో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

550చూసినవారు
బనిగండ్లపాడులో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండల పరిధిలోని బనిగండ్లపాడు పంచాయతీ కార్యాలయంలో భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శనివారం జాతీయ జెండాను వార్డ్ మెంబర్ లక్ష్మి ఆవిష్కరించారు. అనంతరం బోసుబొమ్మ సెంటర్లో జెండా వందన కార్యక్రమాన్ని సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సెక్రటరీ శివ, మండల మహిళా అధ్యక్షురాలు శీలం ఉమా మహేశ్వరి, వార్డు మెంబర్లు రామిరెడ్డి, భాస్కర్, శ్రీనివాసరెడ్డి, సైదమ్మ, సిద్దావలి, అంగన్వాడి టీచర్లు, ఆశా వర్కర్లు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్