ఖమ్మం: నాట్య మయూరి అవార్డును అందుకున్న చిన్నారులు

61చూసినవారు
ఖమ్మం: నాట్య మయూరి అవార్డును అందుకున్న చిన్నారులు
నిత్యమాల నాట్య కళా వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ రవీంద్ర భారతిలో నిర్వహించిన సంగీత నృత్య మహోత్సవం కార్యక్రమంలో ఖమ్మం గుట్టల బజార్ మాన్ ఫోర్ట్ హైస్కూల్ విద్యార్థులు గీతిక, చిన్మయిలు పాల్గొని నాట్య మయూరి అవార్డుని మొదటి బహుమతిగా గెలుచుకున్నారు. ఈ అవార్డును శనివారం బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య చేతులమీదుగా తీసుకున్నారు. ఈ సందర్భంగా మాన్ ఫోర్ట్ హైస్కూల్ మేనేజ్మెంట్ ప్రిన్సిపాల్ అభినందించారు.