ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా రాయల నాగేశ్వరరావు పేరును కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రతిపాదించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎంపీ టిక్కెట్ కోసం రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి నందిని, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి సోదరుడు ప్రసాద్ రెడ్డి, ఇంకో వైపు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల తనయుడు యుగేందర్ పోటీ పడ్డ విషయం తెలిసిందే.