తురకగూడెంలో వికలాంగుడిపై కోతుల దాడి

79చూసినవారు
తురకగూడెంలో వికలాంగుడిపై కోతుల దాడి
కూసుమంచి మండలం తురకగూడెం గ్రామంలో కోతుల బెడద ఎక్కువైంది. గత 6నెలల్లో ఎంతో మందిపై కోతులు దాడి చేసి గాయపర్చాయి. గురువారం కూడా తురకగూడెం గ్రామానికి చెందిన కన్నె బోయిన రవి (35) , డబుల్ బెడ్రూం ఇళ్లలో నివాసం ఉంటున్నారు. తమ ఇంటి దగ్గర ఉన్న చిన్న పిల్లలపై కోతుల గుంపు వచ్చి దాడి చేయటానికి ప్రయత్నం చేయగా వాటిని అడ్డుకోబోయిన కన్నెబోయిన రవిపై కోతులు పడి చేతి పై కాలుపై గాయాలు చేశాయి.

సంబంధిత పోస్ట్