చివరి రోజు ఘనంగా కొనసాగిన బతుకమ్మ వేడుకలు
ఖమ్మం జిల్లా రఘునాధపాలెం మండలం పరిధిలోని పలు గ్రామాలలో దసరా ఉత్సవాలలో భాగంగా గురువారం బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల చివరి రోజు కావడంతో మహిళలు సాంప్రదాయ దుస్తులు ధరించి తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి కోలాట నృత్యాలతో బతుకమ్మ ఆడి నిమజ్జనం చేశారు.