రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛత హి సేవ కార్యక్రమం
రఘునాధపాలెం మండలం పరిధిలోని కోయచలక ఉన్నత పాఠశాలలో శనివారం రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛత హీ సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా కార్యక్రమం ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. అనంతరం విద్యార్థులకు డ్రాయింగ్ పోటీ నిర్వహించి, వారిచే ప్రతిజ్ఞ చేయించారు. గెలుపొందిన వారికి రిలయన్స్ ఫౌండేషన్ వారు బహుమతులను అందజేశారు.