సీఐని సన్మానించిన జనసేన అధ్యక్షుడు కన్న
రఘునాథపాలెం మండల సర్కిల్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన ఉస్మాన్ షరీఫ్ ను ఆదివారం జనసేన పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. మండల అధ్యక్షులు సచ్చు స్రవంత్ ఖన్నా శాలువాతో సన్మానించి, పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు వెంకటేష్, రమేష్ జెఎస్ఆర్ అధినేత రామారావు, భూక్యా త్రిపాఠి తదితరులు పాల్గొన్నారు.