కాంగ్రెస్ హామీల అమలు విఫలం: ఎంపీ

63చూసినవారు
కాంగ్రెస్ హామీల అమలు విఫలం: ఎంపీ
కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలం చెందిందని రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పేర్కోన్నారు. ఆదివారం రాత్రి తల్లాడ మండలం కుర్నవల్లిలో జరిగిన రోడ్ షోలో మాట్లాడారు. కాంగ్రెస్ ఎలాగైనా అధికారంలోకి రావాలన్న కాంక్షతో అలవికాని వాగ్ధానాలు చేశారని, 6 గ్యారంటీలు చెప్పి 420 హామీలిచ్చారని, పచ్చి అబద్ధాలు చెప్పారని విమర్శించారు. నామకు ఈ ఎన్నికలలో భారీ మెజారిటీ వచ్చేలా ఆశీర్వదించాలని కోరారు.

సంబంధిత పోస్ట్