ఎరువులు, విత్తనాలు సబ్సిడీపై ఇవ్వాలి

61చూసినవారు
ఎరువులు, విత్తనాలు సబ్సిడీపై ఇవ్వాలి
ఖరీఫ్ సీజన్లో రైతాంగానికి ఎరువులు, విత్తనాలు సబ్సిడీపై ఇవ్వాలని అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం డివిజన్ కార్యదర్శి నాగిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం సత్తుపల్లి మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి వినతిపత్రం అందజేశారు. ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు, మినీ ట్రాక్టర్లు తదితర వ్యవసాయ పనిముట్లు ఎస్సీ, ఎస్టీ రైతులకు ఉచితంగా ఇవ్వాలని, ఇతరులకు 50% సబ్సిడీపై ప్రభుత్వం ఇవ్వాలన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్