బాల ఉగ్ర నరసింహస్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే మట్టా

54చూసినవారు
బాల ఉగ్ర నరసింహస్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే మట్టా
సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాగమయి దయానంద్ దంపతులు శనివారం కోదాడ సమీపంలోని యర్రావరంలో గల బాల ఉగ్ర నరసింహస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు ఎమ్మెల్యే దంపతులను స్వామివారి శేష వస్త్రాలతో ఘనంగా సత్కరించి తీర్థప్రసాదాలను అందజేశారు. స్వామి వారి ఆశీస్సులతో సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్