ధాన్యాన్ని దళారులకు అమ్మి మోసపోవద్దని, ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద అమ్ముకోవాలని కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ సూచించారు. మంగళవారం పెనుబల్లి మండలంలోని మండాలపాడు, లంకపల్లి, ఏరుగట్ల గ్రామాల్లో ఆయన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఏఎంసీ చైర్మన్ నీరజా ప్రభాకర్ చౌదరి, వైస్ చైర్మన్ కోటేశ్వరరావు, తహసీల్దార్ గంటా ప్రతాప్, మాధవరెడ్డి, బొర్రా కోటేశ్వరరావు, మాధవరావు, దామోదర్ ఉన్నారు