కారేపల్లి మండల టిడిపి సీనియర్ నేత, మైనార్టీ నాయకుడు, కారేపల్లి టౌన్ గ్రామ కమిటీ అధ్యక్షుడు యాకూబ్ అలీ వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. శుక్రవారం రాత్రి కారేపల్లిలో జరిగిన కార్నర్ షోలో ఎమ్మెల్యే కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎన్నో సంవత్సరాలుగా టిడిపి పార్టీలో చురుకైన కార్యకర్తగా పనిచేయడంతో పాటు పార్టీ క్రియాశీలక సభ్యత్వం కలిగి ఉన్నాడు.