కామేపల్లి లోని ముచ్చర్లలో సెల్ టవర్ ను తొలగించాలని డిమాండ్ చేస్తూ స్థానికులు రహదారిపై సోమవారం ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సెల్ టవర్ కారణంగా తాము అనారోగ్యం బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి వెంటనే టవర్ను జనావాసాల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. కోల వెంకటేశ్వర్లు, అప్పారావు, గడేపల్లి రవి తదితరులు ఆందోళన చేశారు.