సంపదకు అధిపతి అయిన కుబేరుడికి మన దేశంలో ఓ గుడి ఉందని చాలా మందికి తెలిసి ఉండదు. మధ్యప్రదేశ్‌లో కుబేరుడి ఆలయం ఉంది. మందసౌర్‌లోని ఖిల్చిపూర్‌లో ఉన్న ఈ ఆలయంలో కుబేరుడితో పాటు శివ పార్వతులు కూడా పూజలు అందుకుంటున్నారు. దీంతో కుబేరుడు పూజలందుకుంటున్న ఏకైక ఆలయంగా ఖిల్చిపూర్ ఆలయం ప్రసిద్ధిగాంచింది. ధన త్రయోదశి రోజున ఈ ఆలయంలో తెల్లవారుజామున 4 గంటలకు తంత్రపూజ చేయడం ఆనవాయితీగా వస్తోంది. కాగా, ఇక్కడి గర్భాలయానికి ఎప్పుడూ కూడా తాళం వేయరు.