ఫ్రాన్స్ అమ్మాయి, భారతీయ యువకుడు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. తమిళనాడులోని తేని జిల్లా ముత్తుదేవన్‌పట్టికి చెందిన కళైరాజన్ 2017లో ఉన్నత చదువుల కోసం ఫ్రాన్స్ వెళ్లాడు. ఈ క్రమంలో మరియం అనే యువతిలో ప్రేమలో పడ్డాడు. ఇరు కుటుంబాల అంగీకారంతో గతేడాది మేలో ఈ జంట ఫ్రాన్స్‌లో వివాహం చేసుకుంది. తాజాగా వీరు ఇండియాకి వచ్చారు. ఈ నేపథ్యంలో ఆదివారం తేని సమీపంలోని వీరపాండిలో తమిళ సంప్రదాయ ప్రకారం బంధువుల సమక్షంలో మళ్లీ పెళ్లి చేసుకున్నారు.