అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో కిడ్నాప్‌కు గురైన బాలికను పోలీసులు కాపాడారు. కిడ్నాపర్‌ను అరెస్టు చేశారు. అతడిని బిహార్‌కి చెందిన మహహ్మద్ బిలాల్‌గా గుర్తించారు పోలీసులు. ఇతనికి గతంలోనే నేర చరిత్ర ఉందని.. పిల్లలను కిడ్నాప్ చేసి బీహార్‌లో విక్రయిస్తున్నట్టు నిర్ధారించారు. బాలిక తల్లిదండ్రులు, బంధువులు పోలీసులకు కృతజ్ఞతలు చెప్పారు. కంప్లైంట్ ఇచ్చిన వెంటనే పోలీసులు స్పందించి తమ పాపను కాపాడారని కృతజ్ఞతలు తెలిపారు.