కేంద్ర కేబినెట్ సమావేశానికి పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి గైర్హాజరయ్యారు. ఆయనను తెలంగాణ
బీజేపీ అధ్యక్షుడిగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై కిషన్ రెడ్డి ఇప్పటివరకు స్పందించలేదు. ఢిల్లీలోని అధికారిక నివాసంలో ఉన్నప్పటికీ ఆయన కేబినెట్ సమావేశానికి హాజరుకాలేదు. కిషన్ రెడ్డి నివాసానికి మంత్రిత్వ శాఖ అధికారులు సైతం రాకపొవడంతో మంత్రి పదవికి ఆయన రాజీనామా చేశారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.