తిరుమల శ్రీవారి లడ్డూల తయారీ కోసం జంతువుల కొవ్వు, చేప నూనె వాడారని ఆరోపణలు రావడంతో శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు జగన్‌పై మండిపడుతున్నారు. కమిషన్ల కోసం కక్కుర్తిపడి శ్రీవారి మనోభావాలతో ఆడుకున్నారని, తిరుమల పవిత్రతను, శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రం చేశారని తిరుపతి జనసేన ఇంచార్జ్ కిరణ్ రాయల్ ఆరోపించారు. తిరుమల ప్రసాదాన్ని అపవిత్రం చేసిన మాజీ సీఎం జగన్ పై కేసు నమోదు చేసి వెంటనే ఆయన్ను అరెస్టు చేయాలని జనసేన నాయకుడు కిరణ్ రాయల్ డిమాండ్ చేశారు.