మడుగులో పడి ఒకరి మృతి

59చూసినవారు
మడుగులో పడి ఒకరి మృతి
రెబ్బెన మండలం నంబాల గ్రామానికి చెందిన టేకం శంకర్ (55) ఆదివారం మడుగులో పడి మృతి చెందాడు. ఎస్సై చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. శంకర్ గత నాలుగు సంవత్సరాల నుండి నాందేవ్ అనే వ్యక్తి దగ్గర పాలేరుగా పనిచేస్తూ జీవిస్తున్నాడు. ప్రతిరోజు ఆవులు ఎద్దులు తీసుకొని మేతకు వెళ్తాడు. ఇదే క్రమంలో ఆదివారం ఆవులను మేతకు తీసుకెళ్ళాడు. ప్రమాదవశాత్తు మడుగులో పడ్డాడు. స్థానికులు గమనించి ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారని ఎస్సై పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్