రెండు ద్విచక్ర వాహనాలు ఢీ.. నలుగురికి గాయాలు

75చూసినవారు
రెండు ద్విచక్ర వాహనాలు ఢీ.. నలుగురికి గాయాలు
ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు పరస్పరం ఢీకొనడంతో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆసిఫాబాద్ మండలంలోని ఇటిక్యాల గ్రామ సమీపంలో ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు సోమవారం రాత్రి ఢీకొట్టాయి. ఈ ప్రమాదంలో బెల్గామ్ గ్రామానికి చెందిన ఇద్దరు, బనార్ గొంది గ్రామానికి చెందిన మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని స్థానికులు ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్