సొంతంగా రోడ్లు మరమత్తులు చేసుకున్న గ్రామస్థులు

84చూసినవారు
సొంతంగా రోడ్లు మరమత్తులు చేసుకున్న గ్రామస్థులు
కొమురం భీం జిల్లా జైనూర్ మండలంలోని తాటిగూడ, చింతకర్ర, కిషన్ నాయక్ తండా, లొద్దిగూడ గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారి గుంతలతో అధ్వానంగా మారింది. దీంతో మంగళవారం మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు సొంతంగా రాళ్ళు, మట్టి పోసి రోడ్లను బాగుచేసుకున్నారు. రోడ్డు మరమ్మతులు చేయించాలని అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన వారు స్పందించడం లేదన్నారు. దీంతో తామే స్వయంగా రోడ్లను బాగు చేసుకున్నామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్