కాగజ్నగర్ పట్టణం ద్వారక నాగర్ కాలనీలో నివాసం ఉంటున్న సృజన్ ఆన్లైన్లో మట్కా ఆడుతున్నాడన్న సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ సీఐ రాణా ప్రతాప్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఈదాడిలో సృజన్ను అదుపులోకి తీసుకొని ఒక ఫోన్, రూ.5వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ వెంకటేష్, కానిస్టేబుల్ మధు, రమేష్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.