దుకాణాల ఎదుట ఉన్న బోర్డులను తొలగించాలి: కాగజ్నగర్ సీఐ
కాగజ్నగర్ పట్టణంలో ని అంబేద్కర్ చౌరస్తాలోని వ్యాపారస్తులు తమ దుకాణాల ఎదుట ఏర్పాటు చేసిన సూచిక బోర్డులను వెంటనే తొలగించాలని సీఐ రాజేంద్రప్రసాద్ తెలిపారు. అదివారం పట్టణంలోని మెయిన్ మార్కెట్ లో ఆయన పర్యటించి దుకాణ సముదాయాలు ఎదుట ఏర్పాటు చేసిన సూచిక బోర్డులతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆ బోర్డులను వెంటనే తొలగించాలని సూచించారు.