వివాహిత అదృశ్యం పై కేసు నమోదు

64చూసినవారు
వివాహిత అదృశ్యం పై కేసు నమోదు
ములకలపల్లి మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన వివాహిత గురువారం ఉదయం పుట్టింటికని ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు పలుచోట్ల వెతికినా ఆచూకి లభించలేదు. దీంతో ఆమె భర్త శనివారం ములకలపల్లి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజమౌళి తెలిపారు.

సంబంధిత పోస్ట్