అశ్వరావుపేట: ప్రజాప్రదర్శన తరలిరండి: సీపీఎం
ఈ నెల 25 నుంచి 28 వరకు సంగారెడ్డిలో నిర్వహించనున్న సీపీఎం రాష్ట్ర 4వ మహాసభలను జయప్రదం చేయాలని పార్టీ జిల్లా కమిటీ సభ్యులు అర్జున్, చిరంజీవిలు తెలిపారు. మహాసభ సందర్భంగా ప్రచార గోడపత్రికలను ఆదివారం అశ్వారావుపేట ప్రజా సంఘాల కార్యాలయంలో ఆవిష్కరించారు. ప్రజా ప్రదర్శనకు పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.