ములకలపల్లిలో మట్టి నిల్వల స్వాధీనం

68చూసినవారు
ములకలపల్లిలో మట్టి నిల్వల స్వాధీనం
ములకలపల్లి మండలం చంద్రుగొండ శివారులోని అటవీప్రాంతంలో పాల్వంచ- దమ్మపేట ప్రధాన రహదారికి సమీపంలో ఎర్రమట్టి అక్రమంగా నిల్వ చేశారన్న సమాచారంతో మంగళవారం సాయంత్రం అటవీశాఖ అధికారులు దాడులు నిర్వహించారు. క్షేత్రస్థాయిలో పర్యటించి మట్టి నిల్వలను స్వాధీనం చేసుకుని విచారణ చేపడుతున్నట్లు ఎఫ్ఆర్వో రవికిరణ్ తెలిపారు