తాత మధు విజయంతో చండ్రుగొండ మండలం లో సంబరాలు

1479చూసినవారు
తాత మధు విజయంతో చండ్రుగొండ మండలం లో సంబరాలు
స్దానిక సంస్దల ప్రజాప్రతినిధులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాత మధు విజయం సాధించడంతో భద్రాద్రి జిల్లా చండ్రుగొండ మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు దారా వెంకటేశ్వరరావు (బాబు) ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలు నిర్వహించారు.

మండల కేంద్రము లోని ప్రధాన సెంటర్ లో బాణాసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ఈసందర్భంగా దారా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్రంలో ఏ ఎన్నికలు నిర్వహించిన అందులో విజయం సాధించేది టిఆర్ఎస్ పార్టీయే అని అన్నారు.

దేశంలో ఏ రాష్ట్రంలో కూడా అమలు కాని సంక్షేమ పథకాలు కేవలం తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తుందని ముఖ్యంగా రైతుబంధు, రైతు బీమా, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, కెసిఆర్ కిట్టు, వృద్ధాప్య పించన్లు, వికలాంగుల పింఛన్లు, ఒంటరి మహిళ పింఛన్, రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్, ఇలా అనేక పథకాలతో దేశంలోనే తెలంగాణరాష్ట్రం నెంబర్ వన్ స్థానంలో ఉందని అన్నారు. ఇక రాబోయే రోజుల్లో కూడా ఏ ఎన్నికలు జరిగినా అది టిఆర్ఎస్ పార్టీ దే విజయం అని జోస్యం చెప్పారు.

ఈ కార్యక్రమంలో జెట్పి కో ఆప్షన్ సభ్యులు ఎస్డి రసూల్, మండల ప్రధాన కార్యదర్శి ఉప్పతల ఏడుకొండలు, గుంపెన సొసైటీ మాజీ చైర్మన్ మేడా మోహన్ రావు, గ్రామశాఖ అధ్యక్షుడు సూర వెంకటేశ్వర్లు, మండల నాయకులు, దారా రత్నాకర్, చీదెళ్ళ పవన్ బాబు, వంకాయలపాటి బాబురావు, మద్దిరాల చిన్నపిచ్చయ్య, మల్లెం వెంకటేశ్వర్లు, బానోత్ బీల్, కాక లక్ష్మయ్య, యువజన అధ్యక్షుడు గుగులోత్ ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you