భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం కమలాపురం గ్రామంలో ఆదివాసి నాయకపొడ్ సేవా సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని జెండా ఎగరవేసి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా మరియు మండల అధ్యక్షులు మాట్లాడుతూ ఆదివాసీ నాయకపొడ్ లు అశ్వరావుపేట నియోజకవర్గం లో రాజకీయంగా ఆర్థికంగా మరియు అన్ని రంగాల్లో కూడా ముందుండాలని ఆ దిశగా యువత అభివృద్ధి చెందాలని అదేవిధంగా రానున్న రోజుల్లో నాయక పోడులు రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలంగా వ్యవహరించాలని ఈ ఆదివాసి దినోత్సవ కార్యక్రమంలో తెలియజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గొల్ల నారాయణ , మండల అధ్యక్షులు ఊరబెద్ది వెంకన్న , ములకలపల్లి ఎంపీపీ మట్ల నాగమణి, కమలాపురం సర్పంచ్ గొల్ల పెంటయ్య, గ్రామ కమిటీ సభ్యులు గొల్ల వీరభద్రం, చిటిక రామకృష్ణ, చిర భద్రయ్య, జక్క ఉపేందర్ , జక్కా రాంబాబు, చేదం రాందాసు, లింగాల నరేష్, మట్ల రమేష్, గుజ్జల భీమరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.