విద్యుత్ సరఫరాలో అంతరాయం

77చూసినవారు
విద్యుత్ సరఫరాలో అంతరాయం
ములకలపల్లి మండలంలోని పొగళ్లపల్లి 11 కేవీ ఫీడర్ పరిధిలో బుధవారం విద్యుత్ సరఫరాలో నిలిపివేయన్నట్లు ట్రాన్స్-కో ఏఈ లక్ష్మీనర్సింహారావు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పీఢరులో మరమ్మతులు చేయనున్న కారణంగా చౌటిగూడెం, పొగళ్లపల్లి, తాళ్లపాయ, రింగిరెడ్డి పల్లి, తిమ్మంపేట. గుండాలపాడు, మంగళిగుట్ట, కొబ్బరిపాడు గ్రామాలకు ఉదయం 7. 30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని తెలిపారు.